Wednesday, 14 August 2013

Jateeya Pathaakam Niyamaalu Telusa meeku.

 

జాతీయ పతాకం నియమాలు

జాతీయ పతాకాన్ని కొన్ని స్థలాలలో అన్నిరోజులూ, కొన్ని స్థలాలలో కొన్ని సందర్భాలలో ఎగురవేస్తారు. జాతీయ పతాకం ఎగురవేయడంలో సరియైన పద్దతులు, సంప్రదాయాలు పాటించాలని కేంద్ర ప్రభుత్వం కొన్ని సూచనలు జారీ చేసినది. వీటిని ఫ్లాగ్ కోడ్-ఇండియాలో పొందు పరిచారు. దీనిలోని ముఖ్యాంశాలు ఇలాఉన్నాయి

 

అధికార పూర్వకంగా ప్రదర్శన కొరకు ఉపయోగించే పతాకం అన్నిసందర్భాలలోనూ ఇండియన్ స్టాండర్డ్ సంస్థ నిర్దేసించిన స్పెసిఫికేషన్స్‌కి కట్టుబడి ఉండి, .యస్. మార్కుని కలిగి ఉండాలి. మిగిలిన అనధికార సంధర్భాలలో కూడా సరయిన కొలతలతో తయారైన పతకాలను ఉపయోగించడం సమంజసం. జాతీయ జెండా కొలతలు: 21'X 14'; 12'X 8', 6'X 4', 3'X 2', 9'X6', సైజుల్లో ఉండాలి. సందర్భాన్ని బట్టి జెండా ఏసైజులో ఉండాలో ఫ్లాగ్ కోడ్ లో పేర్కొన్నారు. జెండా మధ్యభాగంలో ధర్మచక్రం నేవీ బ్లూ రంగులోనే ఉండాలి. ధర్మచక్రంలో 24 గీతలు ఉండాలి.జాతీయజెండాని అలంకరణ కోసం వాడకూడదు. అలానే జెండా ఎగురవేసేటప్పుడు ఎట్టి పరిస్థితులలో నేలను తాకకూడదు. ఎగరవేసేటప్పుడు వేగంగాను, అవనతం చేసేటప్పుడు మెల్లగానూ దించాలి. కాషాయ రంగు అగ్రభాగాన ఉండాలి.సూర్యోదయానంతరం మాత్రమే పతాకం ఎగురవేయాలి. అలాగే సూర్యాస్తమయం కాగానే జెండాను దించాలి. పతాకాన్ని ఏవిధమయిన ప్రకటనలకు ఉపయోగించరాదు. అంతేకాక పతాక స్థంభం పైన ప్రకటనలను అంటించరాదు, కట్టరాదు. ప్రముఖనాయకులు, పెద్దలూ మరణించిన సందర్భాలలో సంతాప సూచికంగా జాతీయ పతాకాన్ని అవనతం చేయాలి. జాతీయ పతాకం వాడుకలో నియమాలన్నీ ప్రతి భారతీయుడూ విధిగా పాటించాలి. జైహింద్!


--

No comments:

Post a Comment